
రామచంద్రాపురం, వెలుగు: రామచంద్రాపురం పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ మందుమూల మల్లన్న జాతరలో ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, పూజా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలు మన ప్రాచీన సాంస్కృతికి ప్రతీకలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నగేశ్, బీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి, కురుమ సంఘం నాయకులు, లోకల్ లీడర్లు పాల్గొన్నారు.